HNK: నేటి నుంచి ఈ నెల 15 వరకు ఎంజీఎంలో స్పెషల్ సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. మీసేవ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న1,280 మందికి పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. స్లాట్ బుక్ చేసుకున్న ఫారంతో పాటు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. స్లాట్ బుక్ చేసినవారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.