KNR: చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామంలో విషాదం నెలకొంది. ఆదివారం గోనెల నాగవ్వ అనే మహిళ స్థానిక వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు ఆమెను బావిలో నుంచి బయటకు తీసేలోపే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.