MNCL: జన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన దాసరి చంద్రమౌళి ఇటీవల మరణించగా, వారి కుటుంబ సభ్యులను ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ పరామర్శించారు. ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, చంద్రమౌళి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు..