KMM: పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఓ వరమని మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇంఛార్జ్ దయాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం నేలకొండపల్లి మంత్రి క్యాంప్ ఆఫీసులో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకుంటుందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.