SRD: మొదటి విడత ఏడు మండలాలు జరిగే పంచాయతీ ఎన్నికలకు 1100 మంది పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పరితోష్ మంగళవారం తెలిపారు. జిల్లాలోని 129 సర్పంచ్ పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అందరు సహకరించాలని కోరారు.