HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడంతో ఎర్రగడ్డ డివిజన్లోని సుల్తాన్ నగర్లో పార్టీ నాయకులు, స్థానికులను మంత్రి దామోదర రాజనర్సింహ కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎర్రగడ్డ డివిజన్లో నవీన్ యాదవ్కు మద్దతుగా ప్రచారం చేయగా, డివిజన్లో కాంగ్రెస్కు భారీ మెజారిటీ వచ్చిందన్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి సంతోషాన్ని పంచుకున్నారు.