MNCL: గిరిజన ఆశ్రమ హాస్టళ్లలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయు ఆధ్వర్యంలో మంగళవారం గిరిజన శాఖ జిల్లా ఇంఛార్జి డీడీ రమాదేవికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ వర్కర్లకు 4 నెలలుగా వేతనాలు రావడం లేదని తెలిపారు. వెంటనే వేతనాలు విడుదల చేయాలని కోరారు.