MBNR: మూసాపేట మండలంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరారు. నిజలాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బీసన్న, BRS నాయకులు, 31 మంది కార్యకర్తలు ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నూతన సభ్యులకు ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.