HYD: మాదాపూర్ పీఎస్ పరిధిలో బైక్ దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 13 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లికి చెందిన కురమయ్య (37) తాళం వేయని వాహనాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అయ్యప్ప సోసైటీలో వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పందగా ఉన్న అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.