SRD: జహీరాబాద్- బీదర్ హైవేపై ఒక లారీని ఆపి అందులో ఉన్న రూ.20లక్షల విలువైన లోడ్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులమంటూ దుండగులు లారీని ఆపి, లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరి వద్ద రూ. 42 వేల నగదు ఎత్తుకెళ్లారు. హద్నూర్ పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.