BHPL: గణపురం మండలం కోటగుళ్లలోని గణపేశ్వరాలయంలో ఇవాళ భూపాలపల్లి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం, అర్చన నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్వామి వారి తీర్థప్రసాదాల అందజేశారు.