KDP: చెన్నూర్ మండల బీజేపీ ఉపాధ్యక్షులు గోవింద్ గణేష్ ప్రజలకు సందేశమిస్తూ, విదేశీ శీతల పానీయాలకు బదులుగా చెరకు రసం, కొబ్బరి నీళ్లు వంటి తాజా పానీయాలు తాగాలని సూచించారు. దీనివల్ల దేశీయంగా రైతులకు ఆదాయం లభిస్తుందని, రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయని ఆయన అన్నారు. విదేశీ వస్తువుల కొనుగోలును 90 రోజులు ఆపివేస్తే భారతదేశం ఆర్థికంగా బలపడుతుందని ఆయన తెలిపారు.