KNR: వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పదేపదే రైతులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు పంట పొలాల్లోని వరి కొయ్యలను కాల్చుతున్నారు. దీంతో భూమిపై పొర కాలిపోయి రైతులకు మేలుచేసే జీవులు నశించి భూమి నిస్సారంగా మారిపోతుంది. పంట దిగుబడులపై ప్రభావం చూపి, వాయు కాలుష్యం ఏర్పడుతుంది.