MHBD: గంగారం మండల వ్యాప్తంగా గ్రామపంచాయతీల ఎన్నికల నేపథ్యంలో ఎస్సై రవికుమార్ పలు సూచన చేశారు. మండల వ్యాప్తంగా 12 గ్రామపంచాయతీల ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించుకోవాలన్నారు. అభ్యర్థులు, ప్రత్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదన్నారు. ఓటు కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరమన్నారు. ఎక్కడైనా ఇటువంటి ప్రయత్నాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలపాలన్నారు.