SRPT: మానవులకు అన్నం పరబ్రహ్మ స్వరూపం, కానీ పశువులకు కాదని కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య తెలిపారు. చిలుకూరు మండలం దూదియా తండాలో రైతు గొర్రెపోతులకు అన్నం పెట్టడంతో అవి పొట్ట ఉబ్బి బాధపడగా, పశువైద్యశాలకు తరలించారు. కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి కావడమే దీనికి కారణమని, ఆపరేషన్ చేసి ఆమ్లాలను తొలగించి చికిత్స అందించినట్లు తెలిపారు.