SRCL: వేములవాడ పట్టణంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లను జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య పరిశీలించారు. రాజన్న ఆలయంలో భక్తులకు ప్రవేశాలను నిలిపివేసిన నేపథ్యంలో ఆలయ పరిసరాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు బందోబస్తును ఇంఛార్జ్ సీఐ శ్రీనివాస్, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్బీ సీఐ రవికుమార్, తదితరులతో కలిసి ఆయన పరిశీలించి పోలీసు సిబ్బందికి తగిన సూచనలు చేశారు.