KMR: బీబీపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఇన్ఛార్జ్ డిప్యూటీ DMHO డా.విజయ మహలక్ష్మి తనిఖీ చేశారు. పీహెచ్సీ ద్వారా ప్రజలకు అందుతున్న జాతీయ, రాష్ట్ర పథకాల వైద్య సేవల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.