GDWL: జిల్లాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం రెండో రోజు జోరుగా కొనసాగింది. రెండో విడతలో మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో అధికారులు నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 74 సర్పంచ్ స్థానాలకు 205 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే, 716 వార్డు స్థానాలకు 341 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.