ఖమ్మం జిల్లాలో కేయూ పరిధిలో వాయిదా పడిన పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలను అధికారులు రీషెడ్యూల్ చేశారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర పరీక్షలు జూన్ 3, 5, 8, 10, 12, 15, 17, 19 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. ఎంబీఏ పరీక్షలు జూన్ 8 నుంచి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.