BHPL: మహాముత్తారం మండలం రెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం ఎస్సై మహేందర్ కుమార్ ఆధ్వర్యంలో గుడుంబా తయారీ కేంద్రాలపై దాడులు జరిపారు. 251 లీటర్ల గుడుంబా, 5500 లీటర్ల వైట్ షుగర్ వాష్‌ను ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన 12 మందిపై కేసులు నమోదు అయినట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజల్లో భరోసా కల్పించారు.