MBNR: వికలాంగులకు అండగా ఉండాలనే సంకల్పంతో వారికి కృత్రిమ అవయవాలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్న తెలంగాణ అమెరికా తెలుగు సామాజిక సేవా సంఘం వారు ఎంతో అభినందనీయులని మహబూబ్ నగర్ శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.