మహబూబ్ నగర్ మండలంలోని ఎదిరె PHCని కలెక్టర్ విజయేందిర బోయి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపీ రిజిస్టర్, ల్యాబ్స్, ప్రసూతి విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గర్భిణీలకు ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులను ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు మెరుగైన సేవలందించాలని ఆమె సూచించారు.