GDWL: ఈనెల 25న గద్వాల రాజవీధిలోని పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగే చేనేత హక్కుల సాధన సభను విజయవంతం చేయాలని చేనేత నాయకులు కోరారు. రాఘవేంద్ర కాలనీలో ఇంటింటికి ఆహ్వాన పత్రికలు పంపిణీ చేశారు. సభకు రాష్ట్రస్థాయి నాయకులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. చేనేత కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.