ఉమ్మడి WGL జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరింది. మంత్రి సీతక్క, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొని గ్రామ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు అభ్యర్థులను గెలిపించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. దీంతో గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది.