KMM: ఉప్పల్ స్టేడియంలో జరగనున్న లియోనెల్ మెస్సి ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలిసి ఇవాళ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సి మ్యాచ్ కోసం వేలాది మంది అభిమానులు రానుండగా ఎవరికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.