VKB: ధరూర్ మండలం నాగసమందర్ వద్ద భారీ వర్షాలకు బ్రిడ్జి కొట్టుకుపోవడంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణ సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, కొట్టుకుపోయిన బ్రిడ్జిని పునర్నిర్మించి, రవాణా సౌకర్యాన్ని కల్పించాలని, తమ కష్టాలను తీర్చాలని గ్రామస్థులు ఏకగ్రీవంగా కోరుతున్నారు.