NRPT: ఊట్కూర్ మండల కేంద్రంలోని శిశు మందిరంలో ఏబీవీపీ నూతన నగర కమిటీ ఎన్నికలు నిర్వహించారు. నగర అధ్యక్షుడిగా శివశంకర్, కార్యదర్శిగా అభిషేక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్య అతిథులుగా జి. భాస్కర్, నర్సింగప్ప హాజరై విద్యార్థుల సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. సంఘ్ పరివార్ నాయకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.