HYD: భక్తుల కోసం మే 29న దిల్సుఖ్నగర్ డిపో నుంచి అరుణాచలానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడపనున్నట్లు RTC అధికారులు తెలిపారు. బస్సు రాత్రి 7 గంటలకు DSNR, 8 గంటలకు MGBS నుంచి బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటుంది. జూన్ 1 ఉదయం హైదరాబాద్కు తిరిగి చేరుకోనుంది. టికెట్ ధర రూ.3,900గా నిర్ణయించారు. వివరాలకు 9959444165ను సంప్రదించవచ్చు.