MBNR: స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను భారీ మెజారిటీతో గెలిపించాలని జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ సూచించారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా పార్టీకి ప్రజాదరణ పెరిగిందని, ప్రజలందరూ కాంగ్రెస్‌పై నమ్మకంతో పనిచేస్తున్నారని అన్నారు. మహిళా అభ్యున్నతి కోసం పార్టీ ఎన్నో పథకాలు తీసుకువచ్చిందని తెలిపారు.