HYD: పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్, అమీన్పూర్ పరిధిలో రెండు నూతన డివిజన్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్‌కు వినతిపత్రం అందజేశారు. కిష్టారెడ్డిపేట కేంద్రంగా ఒక డివిజన్, తెల్లాపూర్‌లో మరొకటి ఏర్పాటు చేయాలని కోరారు. రామచంద్రాపురంలోనే సర్కిల్ కార్యాలయాలు కొనసాగించాలని కోరారు.