NLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిడమానూరు గ్రామపంచాయతీ నుంచి బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బొల్లం సునీత సైదులు సోమవారం రాత్రి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… BRS బలపరిచిన సునీత సైదులును భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.