KMM: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులు చేసే ఖర్చును పకడ్బందీగా నమోదు చేయాలని MPDO శ్రీధర్ స్వామి అన్నారు. ఆదివారం ముదిగొండ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందికి రెండో విడత ఎన్నికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గ్రామ పంచాయతీకి కేటాయించిన ROలు ఎన్నికల అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి వరకు బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు.