SRD: త్వరలో ఓల్డ్ రామచంద్రపురం మార్కెట్ ప్రదేశంలో అధునాతన నూతన మీట్ మార్కెట్ సముదాయ భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తామని రామచంద్రాపురం కార్పొరేటర్ శ్రీమతి పుష్పా నగేష్ అన్నారు. స్థానిక MLA గూడెం మహిపాల్ రెడ్డితో భూమిపూజ చేయించి, భవన నిర్మాణ పనులు మొదలు పెడతామని అన్నారు. మార్కెట్ ప్రాంతంలోని రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులుసైతం ప్రారంభిస్తామని అన్నారు.