GDL: గ్రామాలను అభివృద్ధి చేసే వారికే ప్రజలు ఓటు వేయాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా ఛైర్మన్ రంజిత్ కుమార్ కోరారు. ధరూర్ మండలం నీలిహళ్లి, గుడ్డం దొడ్డి గ్రామాల్లో ఆయన NHPS మద్దతుదారుల తరఫున ఆదివారం ప్రచారం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధి, మార్పు కోసం రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటును సమస్యలపై పోరాడే నాయకులకు వేయాలని విజ్ఞప్తి చేశారు.