NZB: బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయం, శ్రీ మారుతి మందిరాలను సోమవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ విజయ రామరాజు సందర్శించారు. వారు ముందుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయాల ప్రస్తుత స్థితిగతులు, నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ కమల, ఈవోలు ఉన్నారు.