MBNR: మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామంలో ఈ నెల 14న జరగనున్న రెండో విడత ఎన్నికల నేపథ్యంలో ఇవాళ సర్పంచ్, వార్డు అభ్యర్థులతో FST అధికారి నరసింహస్వామి సమావేశం నిర్వహించారు. 5,000లోపు జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.5 లక్షల వరకు ఖర్చు చేయవచ్చని తెలిపారు. ఖర్చుల వివరాలను 45 రోజుల్లోపు ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.