SDPT: జగదేవ్పూర్ మండల వ్యాప్తంగా కేంద్రాల్లో లారీల కొరతతో ధాన్యం రవాణా నిలిచిపోయింది. దీంతో తూకం వేసిన ధాన్యం రాశులు కేంద్రాల్లోనే పేరుకుపోతున్నాయి. ఒకవైపు తీవ్రమైన ఎండలు, మరొకవైపు అకాల వర్షాల భయంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, అదనపు లారీలను ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు.