HNK: విశ్వబ్రాహ్మణుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, ఈ వర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి విశ్వబ్రాహ్మణ కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.