NGKL: జిల్లాలోని ప్రైవేటు క్లినిక్లు, ఆసుపత్రులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఇవాళ డీఎంహెచ్వో డాక్టర్ కె. రవికుమార్ తెలిపారు. ఆయన పలు డయాగ్నస్టిక్, ఫిజియోథెరపీ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేటు పట్టిక ప్రకారమే ఫీజు వసూలు చేయాలన్నారు.