NZB: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులకు ఆయా కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు నేడు గుర్తులు కేటాయించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అనంతరం తెలుగు అక్షరమాల పద్ధతిలో అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారం ముమ్మరం కానుంది.