BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న లేబర్ ఆఫీస్లో సమయపాలన పూర్తిగా లేకుండా పోయింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలు దాటినా కార్యాలయం తెరవకపోవడంతో లేబర్ కార్డుల కోసం వచ్చిన కార్మికులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. జిల్లాకు శాశ్వత ఇంఛార్జ్ లేకపోవడంతో కార్యాలయంలో సిబ్బంది హాజరు కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.