NLG: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొందరు ప్రజాసేవ చేద్దామని నామినేషన్లు వేస్తుంటే, మరికొందరేమో ఇదే అదునుగా దందా చేస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. కొందరు కావాలని నామినేషన్లు వేసి, ప్రధాన పోటీ దారులతో మాట్లాడుకుంటున్నారని, కొంత డబ్బు తీసుకొని విత్ డ్రా చేసుకుంటున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం కొనసాగుతుంది.