NLG: చిట్యాల మండలం ఆరెగూడెం పంచాయతీ ఎన్నికల్లో ఒకటవ వార్డు సభ్యుడిగా పోటీలో నిలిచిన ఆగు భాస్కర్ వినూత్న ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తనకు వచ్చిన ఎన్నికల గుర్తు ‘స్టూల్’ ను కారు పైన ఏర్పాటు చేసి గుర్తును గుర్తుంచుకో… అంటూ ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. సర్పంచ్, మరో నాలుగు వార్డుల్లో పోటీ చేస్తున్న యువకులను గెలిపించాలని ఓటర్లను కోరారు.