MBNR: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్సిటీల ఆధ్వర్యంలో నిర్వహించే ఏబీవీపీ సమ్మేళన వాల్ పోస్టర్స్‌ను పాలమూరు విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీనివాస్ మంగళవారం ఆవిష్కరించారు. ఈనెల 22, 23న కాకతీయ వర్సిటీలో ఈ కార్యక్రమం ఉంటుందని ఏబీవీపీ రాష్ట్ర కో కన్వీనర్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.