KMM: కామేపల్లి మండలం పొన్నెకల్లు గ్రామంలో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ జి. నాగులు సారథ్యంలో మంగళవారం పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు, ఇతర సాధారణ వ్యాధులకు చికిత్సలు అందించారు. చలికాలంలో వచ్చే వ్యాధులకు సంబంధించిన వైద్య సేవలు కూడా అందించారు.