PDPL: ధర్మారం మండలం నంది మేడారం నంది పంప్ హౌస్ లోనికి అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. పంపు హౌస్ నుంచి ఒక మోటార్ ఆన్ చేసి నీటిని నంది రిజర్వాయర్లోకి పంపిస్తున్నారు. అక్కడి నుంచి రామడుగు మండలం లక్ష్మీపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తున్నారు. కాగా, రెండు రోజులపాటు ఒక పంపు ద్వారా నీటిని విడుదల చేయనున్నారు.