JGL: జిల్లాలో నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం.. యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం, పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, నిబంధనలకు విరుద్ధంగా డి.జే. వినియోగించరాదని ఆయన తెలిపారు.