NLG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల విశ్వాసం పొందేందుకు అభ్యర్థులు బాండ్ పేపర్ రాసిచ్చి ప్రచారం చేస్తున్నారు. చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ఆరూరి శివకుమార్.. మేనిఫెస్టో హామీలను నిజాయితీగా అమలు చేస్తానని బాండ్ పేపర్‌పై రాసిచ్చి ఓటర్ల ఆశీర్వాదం తీసుకున్నారు. యువకులకు మద్దతు ఇవ్వాలని ఆయన గ్రామస్థులను కోరారు.