SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంను శ్రీ శ్రీ అద్వైతానంద భారతి స్వామిజీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర సరస్వతి అంత్య పుష్కరాలు, కాళేశ్వరం దర్శనం అనంతరం వారు వేములవాడకు విచ్చేశారు. ఆలయానికి చేరుకున్న స్వామిజీకి అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనం అందజేశారు.