కరీంనగర్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఈ అదాలత్లో క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటార్ ప్రమాద పరిహార వంటి కేసులు ఇరుపక్షాల రాజీతో పరిష్కరించబడతాయని అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కె. రాణి తెలిపారు. రాజీపడదగిన వారు సంబంధిత పోలీసు వారిని సంప్రదించాలని ఆమె సూచించారు.